హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలో అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. బేగంబజార్ మహారాజ్ గంజ్‌లోని ఓ ఇంట్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంట్లో దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఓ చిన్నారి సహా ఐదుగురిని క్రేన్ సాయంతో సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు
మూడు అంతస్తుల భవనంలోనరి మొదటి రెండు అంతస్తులను ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామగ్రిని నిల్వచేసే గోదాములుగా వినియోగిస్తున్నారు. మూడో అంతస్తులో యజమాని కుటుంబం నివాసముంటోంది. ఈ ప్రమాదంతో పరిసరాల్లో పొగ దట్టంగా అలముకుంది.
