వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) జైలులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జైలు సిబ్బందికి చెప్పడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వల్లభనేనికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మూడు నెలల క్రితం అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవలే బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ అరెస్ట్ కావడంతో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు.