ఉస్తాద్ రామ్(Ram Pothineni) పోతినేని హీరోగా తెరకెక్కతుతున్న కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka) అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఫ్యాన్‌గా రామ్ నటించబోతున్నట్లు చూపించారు. మొత్తానికి గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. ఏపీ ప్రజల్లో ఉండే సినిమా పిచ్చి ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.