ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్(NTR) తాజాగా ఓ బయోపిక్ చిత్రంలో నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో తారక్ యాక్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made In India) అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనుండగా.. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా స్టోరీ విని ఇందులో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నారు. అలాగే హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ మూవీలోనూ నటించాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’.. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలోనూ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.