Thursday, May 15, 2025
Homeహెల్త్ఐస్ క్రీం తినే ముందు ఒక్కసారి ఆలోచించండి.. ఎంత డేంజరో తెలుసా..?

ఐస్ క్రీం తినే ముందు ఒక్కసారి ఆలోచించండి.. ఎంత డేంజరో తెలుసా..?

వేసవిలో చల్లని ఐస్ క్రీం తినడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు.. కానీ ఈ చక్కని రుచికి అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ క్రీం రోజువారీ అలవాటవ్వడం వల్ల శరీరంపై అనేక రకాల ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే అధిక చక్కెర, ఫ్యాట్ కారణంగా ఆరోగ్యానికి ముప్పు పెరుగుతోంది.

- Advertisement -

ఐస్ క్రీంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలపై నెమ్మదిగా దాడి చేస్తుంది. తరచుగా ఐస్ క్రీం తింటూ, దంతాలు శుభ్రం చేసుకోకపోతే వాటిపై కీళ్లు ఏర్పడి, దంత నొప్పి, దంతక్షయం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఐస్ క్రీంలో ఉన్న అధిక క్రీమ్, చక్కెర శరీరంలో కాలొరీస్ పెంచుతూ, బరువు పెరగడానికి దోహదపడతాయి. బరువు తగ్గేందుకు ట్రై చేస్తున్నవారు ఐస్ క్రీం తింటే వారి యత్నాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.

కొందరికి పాల ఉత్పత్తులు పడవు.. అలాంటి వారు ఐస్ క్రీం తిన్న వెంటనే పేగులలో ఉబ్బరం, నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. ఇక ఐస్ క్రీం తరచూ తింటే హార్మోన్‌లపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారికి మొటిమలు, చర్మంపై చిన్న చిన్న ఎలర్జీలు వస్తుండటం ఐస్ క్రీం కారణంగా జరిగే ప్రభావమే కావచ్చని వారు సూచిస్తున్నారు.

ఐస్ క్రీంలో అధికంగా ఉండే చక్కెర, డయాబెటిస్ ఉన్నవారికి తీవ్ర ప్రమాదంగా మారవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచే అవకాశం ఉంది. దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. చల్లని ఐస్ క్రీం ఒత్తిడిని తగ్గించవచ్చు. కానీ దానిని ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి నష్టమే ఎక్కువ. ఐస్ క్రీం తినడంలో పరిమితి ఉంచుకోవాలి. రుచి కోసం ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి తలెత్తకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News