‘ఆపరేషన్ సిందూర్’ విజయంవతం అయిన నేపథ్యంలో భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలో ఏపీ బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహించనుంది. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారతీయ జెండాలతో ర్యాలీ జరగనుంది. దీంతో పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని బీజేపీ నేతలు కోరారు.
- Advertisement -
అలాగే సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆహ్వానం అందించారు. పురందేశ్వరి ఆహ్వానం మేరకు ర్యాలీలో ఇద్దరు నాయకులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యకంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.