తిరుమల(Tirumala) శ్రీవారిని ఇస్రో(Isro) చైర్మన్ వీ. నారాయణన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 18వ తేదీ పీఎస్ఎల్వీ సి61 రాకెట్ ద్వారా భూమి పరిశీలన శాటిలైట్‌ను గగనతలంలోకి పంపనున్నారు. ఈమేరకు రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని పీఎస్ఎల్వీ సి61, భూమి పరిశీలన శాటిలైట్ నమూనాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో రాకెట్ నమూనాలకు, ఇస్రో చైర్మన్‌కు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు చైర్మన్‌ను పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ…ఈనెల 18వ తేదీ ఇస్రో ఆధ్వర్యంలో 101వ ఉపగ్రహ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పీఎస్ఎల్వీ సి61 ఉప్రగహం భూమి పరిశీలన శాటిలైట్ రాకెట్‌ను గగనతలంలోకి తీసుకెళ్లనుందని పేర్కొన్నారు. 1962లో ఇండియా నింగిలోని రాకెట్లను పంపడం ప్రారంభించిందన్నారు. ఈ 62 ఏళ్లలో 63 పీఎస్ఎల్వీని ఇస్రో లాంచ్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.