Saturday, May 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Sanjiv Goenka: తిరుమ‌ల శ్రీవారికి సంజీవ్ గోయెంకా భారీ విరాళం

Sanjiv Goenka: తిరుమ‌ల శ్రీవారికి సంజీవ్ గోయెంకా భారీ విరాళం

తిరుమ‌ల(Tirumala) శ్రీవారికి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మాని సంజీవ్ గోయెంకా(Sanjeev Goenka) భారీ విరాళం అంద‌జేశారు. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వామివారికి బ‌హూక‌రించారు. ఐదు కిలోల బంగారంతో చేయించిన క‌టి హ‌స్తం, వ‌ర‌ద హ‌స్తాల‌ను టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రికి అందించారు.

- Advertisement -

కుటుంబసమేతంగా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న గోయెంకాకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గోయెంకా మాట్లాడుతూ.. స్వామివారికి ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News