Saturday, May 17, 2025
Homeచిత్ర ప్రభKannappa Comics: ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

Kannappa Comics: ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

డైనమిక్ స్టార్ విష్ణు మంచు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. టీజర్‌లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఇటీవల యూఎస్‌లో విష్ణు ప్రమోషనల్ టూర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బురపరిచేలా ఉంది. ఇంతకుమించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News