Friday, November 22, 2024
HomeతెలంగాణHyd: ఉగాది కవి సమ్మేళనం

Hyd: ఉగాది కవి సమ్మేళనం

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. నగదు ప్రోత్సకాలను అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కవులు, కళాకారులను, సాహితీవేత్తలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రోత్సాహకాలు అందిస్తూ గౌరవిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి CM KCR స్వయంగా గొప్ప కవి, సాహిత్య అభిమాని అనీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో శ్లాఘనీయమన్నారు. ప్రముఖ కవులు దాశరథి, కాళోజి గార్ల పేరిట ప్రత్యేక సాహిత్య అవార్డులను ప్రతి సంవత్సరం కవులకు, సాహితీ వేత్తలకు అందిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య అభివృద్ధి కోసం తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కవి సమ్మేనాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కవులు దృష్టి సారించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాకవి, ఎంఎల్సి గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కవులు అమ్మంగి వేణుగోపాల్ , సిద్ధార్థ రామచంద్రమౌళి, వనపట్ల సుబ్బయ్య కోట్ల వెంకటేశ్వర రెడ్డి శ్రీకాంత్ నెల్లెట్ల రమాదేవి జూపాక సుభద్ర అయనంపూడి శ్రీలక్ష్మి తదితరులు కవులు, సాహితివేత్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News