ఇటీవల హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా.. కొంతమంది వాహనాదారులు మాత్రం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన ఫోటో ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
“పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం.. ప్రమాదమని తెలిసినా కూడా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారు. సమయం ఆదాతో పాటు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే తాపత్రయం తప్ప.. అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించడం లేదు. ప్రమాదపుటంచున ప్రయాణం వద్దు.. మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండని” సజ్జనార్ సూచించారు.