తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆర్టీసీ బస్సులను ఆకస్మిక తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. బస్సుల్లో ప్రయాణికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా పంజాగుట్ట నుంచి లక్డీకపూల్ హైదరాబాద్ కలెక్టరేట్ వరకు సిటీ బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవాలంటూ నెటిజన్లు మంత్రిని అభినందిస్తున్నారు.