Sunday, May 18, 2025
HomeఆటIPL 2025: రాజస్తాన్ పై పంజాబ్ కింగ్స్.. సూపర్ విక్టరీ..!

IPL 2025: రాజస్తాన్ పై పంజాబ్ కింగ్స్.. సూపర్ విక్టరీ..!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో అద్భుత విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ రేసులో పోటీని పెంచింది.

- Advertisement -

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రారంభంలో ప్రియాన్ష్ ఆర్య (9), ప్రభుసిమ్రన్ సింగ్ (21), మిచెల్ ఓవెన్ (0) వంటి ఆటగాళ్లు విఫలమైనా.. నేహల్ వాదేరా ఆగ్రెసివ్ ఇన్నింగ్స్‌తో జట్టును గాడిలోకి తీసుకొచ్చాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సులు) బాదాడు. శ్రేయస్ అయ్యర్ (30), శశాంక్ సింగ్ (59 నాటౌట్) మరియు ఓమర్ జై (21) కలిసి సహకరించడంతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. రాజస్తాన్ బౌలింగ్ విభాగంలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీసుకోగా, రియాన్ పరాగ్, ఆకాష్ మద్వాల్, మపాకా చెరో వికెట్ తీశారు.

అనంతరం భారీ స్కోర్ ఛేజింగ్ కోసం బరిలో దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్లు మెరుపులు మెరిపించారు. యశస్వీ జైశ్వాల్ 50 (9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ 40 (4 ఫోర్లు, 4 సిక్సులు) పరుగుల వర్షం కురిపించారు. కానీ వీరిద్దరు ఔటైన తర్వాత మిడిలార్డర్ ఆటగాళ్లు నిరాశపరిచారు. సంజూ శాంసన్ (20), రియాన్ పరాగ్ (13), హెట్మేయర్ (11) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. చివర్లో ధ్రువ్ జురేల్ 53 (3 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు చేసి పోరాడినప్పటికీ.. జట్టు విజయం దూరంగా నిలిచింది. రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News