భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్భూమిలో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
- Advertisement -
ఈ మేరకు రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఎమోషన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా నీ జ్ఞాపకాలు ప్రతి అడుగులో నాకు మార్గదర్శనం చేస్తాయి. నీ కలలను సాకారం చేయడమే నా సంకల్పం. వాటిని తప్పకుండా నెరవేరుస్తా’ అంటూ రాసుకొచ్చారు.