కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సోదరుల కష్టాలకు పరిష్కారం చూపేందుకు కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం వపనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు. కాగా ఏపీలో పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు కుంకీ ఏనుగులను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.