క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. పసికూన యూఏఈ(UAE) చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్(Bangladesh) జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. టెస్టు హోదా కలిగిన జట్టుపై ద్వైపాక్షిక సిరీస్ గెలడం యూఏఈకి ఇదే తొలిసారి కావడం విశేషం.
బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో తంజిద్ హసన్ (40), జాకర్ అలీ(41) పరుగులతో రాణించారు. కెప్టెన్ లిటన్ దాస్ (14),తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) విఫలమయ్యారు. ఇక యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లు తీయగా.. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో అలిషాన్ షరాఫూ (68) పరుగులతో రాణించాడు. దీంతో టీ20 సిరీస్‌ను యూఏఈ 2-1తో కైవసం చేసుకుంది. తొటి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయినా తర్వాత రెండు మ్యాచ్‌లో విజయం సాధించి శభాష్ అనిపించింది.