ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మాటా మంతి’ పేరుతో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వెండితెరను ఎంచుకున్నారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. టెక్కలిలోని భవానీ థియేటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా పవన్‌కు ఉన్న సినీ, పొలిటకల్ క్రేజ్ దృష్ట్యా ప్రజా సమస్యలను స్వయంగా వచ్చి తెలుసుకునేందుకు ఇబ్బంది పరిస్థితులు తలెత్తుతున్నాయని.. అందుకే ఇలాంటి కార్యక్రమం చేపట్టారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.