Thursday, May 22, 2025
Homeచిత్ర ప్రభప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి.. దీపికా పదకొన్ ఔట్.. కొత్త హీరోయిన్ ఎవరంటే..?

ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి.. దీపికా పదకొన్ ఔట్.. కొత్త హీరోయిన్ ఎవరంటే..?

ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, టి-సిరీస్ ఫిలిమ్స్ నిర్మాణంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, మెక్సికోలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశామని ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

ఇంతలోనే ఈ సినిమా నుంచి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌లో దీపికానే హీరోయిన్ అని, స్క్రిప్ట్ వినిపించాక ‘ఓకే’ చెప్పినట్టుగా సినీ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సందీప్ వంగా ఆమెను ఈ సినిమా నుంచి తప్పించాడని వార్తలు బయటికొచ్చాయి.

దీనికి కారణాలు పలు కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొదటిగా దీపికా ప్రతిరోజూ కేవలం 8 గంటల టైం మాత్రమే ఇస్తానని, అందులోనూ కేవలం 6 గంటలే షూటింగ్ చేస్తానని షరతులు పెట్టిందట. రెమ్యునిరేషన్ విషయానికొస్తే, ఆమె 20 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో పాటు, సినిమాకు లాభాలు వస్తే వాటాలో భాగం కావాలని కోరిందట. అంతటితో ఆగకుండా, తెలుగు డబ్బింగ్ తానే చెప్పాలని దర్శకుడు అడిగితే తిరస్కరించిందట.

ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే… ఇటీవలే దీపికా పదుకోన్ తల్లిగా మారింది. పాప పుట్టిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్ మారొచ్చని ఊహిస్తున్నారు. దీంతో స్పిరిట్ ప్రారంభం ఆలస్యం అవుతుందన్న టెన్షన్ డైరెక్టర్ వంగకు మొదలైందట. అంతేకాదు, దీపికా మరియు సందీప్ వంగా మధ్య అభిప్రాయ భేదాలు కూడా జరిగాయట. వర్కింగ్ స్టైల్ లోనూ ఇద్దరి మధ్య clicking లేదని, షూటింగ్ ప్రాసెస్ లో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని అర్థమవుతోంది. అందుకే వంగ కూడా ఇక చాలు అని అనుకున్నాడట.

ఇలా పలు కారణాలతో దీపికా పదుకోన్ స్పిరిట్ నుంచి తప్పుకోవడం ఖరారైపోయినట్లే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే… ప్రభాస్ పక్కన హీరోయిన్ ఎవరు..? అనే ఆసక్తి. సందీప్ వంగా ఎలాంటి కొత్త జోడీని తెరకెక్కిస్తాడో చూడాలి. ఎందుకంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వంగా… ఇంకో మైండ్ బ్లోయింగ్ జోడీతో ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం ఖాయం. ఇలాంటి సమయంలో స్పిరిట్ లో ఏ హీరోయిన్ నటిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News