గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది'(Peddi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.
తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి చరణ్ ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ గ్యాప్‌లో చరణ్, బుచ్చిబాబు, దివ్యేందు శర్మ(మీర్జాపూర్ మూవీ ఫేమ్) సరదాగా మాట్లాడుకుంటున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పెద్ది’ యాక్షన్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్, హార్డ్ వర్క్‌తో కొనసాగుతుంది అని రాసుకొచ్చారు. మూవీ యూనిట్ కూడా సెట్ నుంచి ఈ ముగ్గురు కలిసి ఉన్న మరో ఫొటో షేర్ చేసింది.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.