ఏపీ మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో(Supreme Court) చుక్కెదురైంది. పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదని.. తన అరెస్ట్ అక్రమమని బెయిల్ మంజూరు చేయాలని రాజ్ కెసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
- Advertisement -
ఇక తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని రాజ్ తండ్రి కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం.. ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ రెండు పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.