తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు(Polycet results) విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సాంకేతిక విద్య కమిషనర్ దేవ సేన పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న పాలిసెట్(TG Polycet) పరీక్షను నిర్వహించారు. మొత్తం 98,858 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మూల్యాంకనం అనంతరం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.