బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (Mukul Dev) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్ దేవ్. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ దేవ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడట. ఒంటరి జీవితంతో ఆయన ఆరోగ్యం పాడైపోయినట్లు తెలుస్తోంది. ఆయన మృతి నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
‘దస్తక్’మూవీతో నటుడిగా వెండితెరకు పరిచమైన ఆయన బాలీవుడ్లోనే కాకుండా తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ సినిమాతో విలన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కేడి’, ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్’ వంటి చిత్రాల్లోనూ విలన్ పాత్రలు పోషించారు.