Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభSSMB#29: 6 నెలల ట్రైనింగ్ తరువాతే షూటింగ్

SSMB#29: 6 నెలల ట్రైనింగ్ తరువాతే షూటింగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా మరో 6 నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.  మరి ఈ 6 నెలలు ఏం చేస్తారంటే.. వర్క్ షాపులో ట్రైనింగ్ ఫినిష్ చేస్తారు.  మీకు తెలుసుకదా జక్కన్న ఎంత మిస్టర్ పర్ఫెక్టో.  జక్కన్న, ప్రిన్స్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా కోసం అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయిస్ కి ఈ ట్రైనింగ్ జరుగుతోంది. 

- Advertisement -

గతంలో రాజమౌళి తీసిన అన్ని సినిమాలకంటే మహేష్ బాబు సినిమా భారీ స్థాయిలో ఉంటుందని, ఇందుకు ఉపయోగించే వీఎఫ్ ఎక్స్ అత్యంత ఆసక్తిగా ఉంటాయని తెలుస్తోంది.  ఇండియానా జోన్స్ లా ఈ సినిమా ఉంటుందని, దీనికి మోడర్నిటీని యాడ్ చేయనున్నట్టు అడ్వెంచరస్ అండ్ విజువల్ ఫీస్ట్ గా ఉండబోయే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని జక్కన్న ఎప్పుడో రివీల్ చేసేశారు.

2024 సమ్మర్ కు ఈ SSMB 29 రెడీ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News