నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’(Hit 3) మూవీ మే 1న విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘హిట్’ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని రెచ్చిపోయాడు. సాఫ్ట్‌గా కనిపిస్తూనే వైలెంట్‌గా నటించాడు. దీంతో తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. తొలి రోజే రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచింది. అలాగే రూ.100కోట్ల క్లబ్‌లోకి చేరింది.
ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా మే 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించగా.. రావు రమేశ్, సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా కీలకపాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నాడు.