టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై(Chandrababu) బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంత గొప్పోడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిలో ఒక సచివాలయం కట్టలేకపోయాడని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి.. ప్రధాని మోదీ అండ ఉండి కూడా ఎందుకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదని నిలదీశారు. అదే ఐదేళ్లలో ఇక్కడ కేసీఆర్ ఉన్నదాన్ని కూలగొట్టి.. ఐదేళ్లలో అద్భుతమైన కొత్త సెక్రటేరియట్ కట్టారని తెలిపారు.
ఎందుకు ఇంకా ఏపీలో రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని ప్రశ్నించారు. గుజరాత్‌లో కూడా రైతులకు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో కేసీఆర్ ఒక్కడే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారని తెలిపారు. కనీసం రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కేసీఆర్‌పై మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. కేసీఆర్ మాట్లాడటం స్టార్ట్ చేస్తే.. మోడీ బట్టలు ఊడిపోవడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు.