ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయే ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం మోదీ సీఎంలతో టీ తాగుతూ సరదాగా ముచ్చటించారు.
- Advertisement -

ముఖ్యంగా ప్రతిపక్ష సీఎంలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తోనూ నవ్వుతూ మాట్లాడటం ఆకట్టుకుంది.

అలాగే ఎన్టీఏ సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తదితర సీఎంలతోనూ మోదీ సరదాగా మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

