Friday, September 20, 2024
HomeతెలంగాణKCR: కౌలు రైతులను ఆదుకుంటాం

KCR: కౌలు రైతులను ఆదుకుంటాం

గాలివానతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి రాష్ట్రంలో 2 లక్షల 22 వేల 250 ఎకరాల్లో నష్టం కలిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.  ముఖ్యంగా మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72, 709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు 17, 238 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోడ్ ప్రకారం రైతులకు పెద్దగా ఏం రాదని, రైతులు ఏమాత్రం నిరాశకు గురి కావద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేసీఆర్.

- Advertisement -

ఈ దేశంలో ఓ పద్దతీ పాడూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నయ్ తప్పితే పంట నష్టం జరిగితే రైతులకు లాభాలు కలిగించే బీమా సంస్థలు, బీమాలు లేవని కుండబద్ధలు కొట్టారు సీఎం.    కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్లుందని ఆయన ఆరోపించారు. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉందని, మొత్తం వ్యవసాయ పాలసీని బీఆర్ఎస్ ఇస్తుందన్నారు. గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. మా రైతులను మేమే కాపాడుకుంటం.. వంద శాతం మేమే ఆదుకుంటామన్నారు కేసీఆర్.

దేశంలోనే మొదటిసారిగా సహాయ పునరావాస చర్యలను తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలను అందిస్తామన్నారు.  కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రూ.228 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.  రైతులు ధైర్యం కోల్పోవద్దని కేసీఆర్ ఈసందర్భంగా మనవి చేశారు. ఖమ్మం జిల్లా రావినూతలపాడులో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News