Thursday, May 29, 2025
Homeట్రేడింగ్Bank Holidays: జూన్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

Bank Holidays: జూన్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవుల(Bank Holidays) జాబితాను ప్రకటించింది. నెల మొత్తంలో 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఇందులో స్థానిక పండుగలు, జాతీయ సెలవులు, రెండో, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. అయితే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ, డిజిటల్ వాలెట్‌లు, ఏటీఎంల ద్వారా సెలవు రోజుల్లో కూడా డబ్బు బదిలీ, బిల్ చెల్లింపులు చేసుకోవచ్చు.

- Advertisement -

పబ్లిక్ హాలిడేస్:

జూన్ 6 (శుక్రవారం) : ఈద్-ఉల్-అధా (బక్రీద్) : అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 7 (శనివారం) : బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) : ప్రధాన నగరాలతో సహా దేశంలోని చాలా ప్రాంతాలలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 11 (బుధవారం) : సంత్ గురు కబీర్ జయంతి : సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 27 (శుక్రవారం) : రథయాత్ర : ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 30 (సోమవారం) : రెమ్నా ని : మిజోరంలో బ్యాంకులు పనిచేయవు.

వారాంతపు సెలవులు:

జూన్ 1 (ఆదివారం)
జూన్ 8 (ఆదివారం)
జూన్ 14 ( రెండో శనివారం)
జూన్ 15 (ఆదివారం)
జూన్ 22 (ఆదివారం)
జూన్ 28 (నాలుగో శనివారం)
జూన్ 29 (ఆదివారం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News