టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టికి(Naveen Polishetty) ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నవీన్ ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి దర్శకడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా సినిమా విడుదల తేదిని మేకర్స్ ఆసక్తికరంగా ప్రకటించారు. ఈమేరకు ఓ వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.