వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. రేపు (బుధవారం) ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయంపై తర్వాత ప్రకటన చేస్తామని వెల్లడించింది.
- Advertisement -
కాగా పొగాకు పంటకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులను జగన్ పరామర్శించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలను తెలుసుకోవాలని భావించారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు.