ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ జితేశ్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్న ఆర్సీబీ ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 2లో చేరుతుంది. ఓడిపోతే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ 2కు వెళ్లాలనే పట్టుదలో ఉంది. మరోవైపు చివరి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ముగించాలని లక్నో భావిస్తోంది.
ఆర్సీబీ జట్టు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ(కెప్టెన్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార
లక్నో జట్టు: మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, అవేశ్ ఖాన్, విలియం ఓ రూర్క్