Wednesday, May 28, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ జయంతి అధికారికంగా జరపాలి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఎన్టీఆర్ జయంతి అధికారికంగా జరపాలి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటరత్న, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతిని ఇకపై అధికారికంగా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు మే 28న ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్ సంతకంతో విడుదలైన ఈ ఉత్తర్వుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని అన్ని విభాగాలూ దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.

ఇక మరోవైపు, టీడీపీ మహానాడు కడపలో జరుగుతున్న తరుణంలో ఎన్టీఆర్ జయంతిని అక్కడ ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల్లో ఎన్టీఆర్ అభిమానులు, ప్రవాస తెలుగువాళ్లు ఈ జయంతిని పురస్కరించుకుని వేడుకలు జరపనున్నారు. తెలుగు ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌కు ఇది fitting tribute అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ తరఫున అధికారికంగా ఈ వేడుకలు జరపడం తెలుగు సంస్కృతికి, రాజకీయ చరిత్రకు మరొక మైలురాయిగా నిలవనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News