తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను(Gaddar Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. జూన్ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
- Advertisement -
ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఎంపికయ్యారు. పుష్ప2 మూవీలోని బన్నీ నటనకు గాను ఈ అవార్డు దక్కింది. కాగా గతంలో పుష్ప మూవీలో నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప2 మూవీకి ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు రావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.