తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు(Gaddar Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో కొన్ని సినిమాలు అదరగొట్టాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్, కల్కి 2898AD, 35 ఇది చిన్నకథ కాదు, రజాకార్ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయి.
ఉత్తమ మూడవ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటర్, స్పెషల్ జ్యురి అవార్డు హీరో విభాగాల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమా అవార్డులు గెలుచుకుంది.
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘కల్కి 2898AD’ సినిమా అవార్డులు గెలుచుకుంది.
ఉత్తమ నటి, ఉత్తమ బాలల చిత్రం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో ’35 ఇది చిన్నకథ కాదు’ సినిమా అవార్డులు గెలుచుకుంది.
ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ విభాగాల్లో ‘రజాకార్’ సినిమా అవార్డులు గెలుచుకుంది.
ఇక పొట్టెల్, రాజు యాదవ్, గామి, మత్తు వదలరా 2, పుష్ప 2, కమిటీ కుర్రోళ్ళు సినిమాలు రెండేసి విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి.
ఆయ్, సరిపోదా శనివారం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఊరు పేరు భైరవకోన, మ్యూజిక్ షాప్ మూర్తి, దేవర, గ్యాంగ్ స్టర్, ‘క’ సినిమాలు ఒక్కో విభాగంలో అవార్డులు దక్కించుకున్నాయి.