Saturday, May 31, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందన ఇదే

Allu Arjun: గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందన ఇదే

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా గద్దర్ అవార్దు రావడంపై బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో పుష్ప2 సినిమాకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డు దక్కడం వెనుక చిత్ర బృందం కృషి ఎంతో ఉంది. ఈ క్రెడిట్ అంతా నా దర్శకుడు సుకుమార్ గారికి, నా నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ నిరంతర మద్దతు నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది” అని బన్నీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News