Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి

Srisailam: ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ఐదు రోజులపాటు జరిగే మహోత్సవాల ఐదవ రోజైన ఈరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి వారి యగశాలలో చండీస్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి, అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన, త్రిశూల స్నానం జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమ గుండంలోకి ఆహుతిగా ఆలయ ఈవో లవన్న సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

- Advertisement -

అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత చండీశ్వర స్వామిని పల్లకిలో ఊరేగింపుగా ఆలయంలోని మల్లికా గుండం వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వర స్వామికి వైదిక శాస్త్రంగా స్నానం చేయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News