Friday, June 6, 2025
HomeతెలంగాణRevanth Reddy: హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Revanth Reddy: హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు హీటెక్కుతాయి. అయితే ఇవాళ హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

- Advertisement -

“సిద్దిపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీశ్ రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.” అని ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News