Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభహరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా..?

హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో గత ఐదేళ్లుగా వాయిదాపడిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూన్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రోమోషన్లు కూడా జోరుగా ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల కథనం.

- Advertisement -

సినిమాకు సంబంధించిన కొన్ని VFX పనులు పూర్తి కాలేదని, టెక్నికల్ సమస్యలు ఏర్పడినట్లు సమాచారం. దీంతో జూన్ 12న విడుదల చేయాలన్న యోచన నుంచి వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక జూన్ 8న తిరుపతిలోని SV యూనివర్సిటీ తారకరామ క్రీడా మైదానంలో పవన్ పాల్గొననున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు ప్రారంభించినా, అది కూడా వాయిదా వేసినట్లు సమాచారం. ఈ వాయిదా వల్ల పవన్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News