Diabetes Control Tips: డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక దీర్ఘకాలిక ఆరోగ్యసమస్య. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం లేదా ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ కంట్రోల్ చేయకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, నరాల దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే డయాబెటిస్ కంట్రోల్ చేయడంలో కొన్ని ఆరోగ్య చిట్కాలు సహాయపడుతాయి. ఇప్పుడు డయాబెటిస్ వారు పాటించాల్సిన చిట్కాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
- ఆరోగ్యకరమైన ఆహారం:
డయాబెటిస్తో బాధపడేవారు ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గోధుమలు, రాగులు, జొన్నలు బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తాయి. అవకాడో, నట్స్, ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను మితంగా తీసుకోండి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. కాబట్టి మీ డైట్ లో చేర్చుకోండి.
డయాబెటిస్ ఉన్నవారు చేపలు, లీన్ మీట్, పప్పులు, పనీర్ తీసుకోవడం మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. అలాగే కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. మధుమేహంతో బాధపడేవారు స్వీట్ లను తక్కువగా తీసుకోవడం మంచిది. ఇవి షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచుతాయి.
- వ్యాయామం చేయండి: డయాబెటిస్ తో బాధపడేవారు ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇంట్లో పని చేయడం వంటివి మీ రోజువారీ కదలికలను పెంచుతాయి.
- బరువు నిర్వహణ: అధిక బరువు, ఊబకాయం ఉండటం వల్ల డయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
- షుగర్ లెవల్స్: నెల ఒకసారి షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం ముఖ్యం. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఒక గ్లూకోమీటర్ ఉపయోగించి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవచ్చు.
- మందులు: మీ వైద్యుడు సూచించిన విధంగా మందులు లేదా ఇన్సులిన్ ఉపయోగించుకోండి.