హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై(Cable Bridge) శుక్రవారం సాయంత్రం ఓ కారు పూర్తిగా దగ్థమైంది. వంతెనపై ప్రయాణిస్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే ఈ ఘటన కారణంగా కేబుల్ బ్రిడ్జి మీదుగా రోడ్డు నెంబర్ 45 వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.