Sunday, June 8, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan: ఓజీ బ్లడ్ బాత్.. పవన్ కళ్యాణ్ తో అర్జున్ దాస్ ఫొటోలు వైరల్

Pawan Kalyan: ఓజీ బ్లడ్ బాత్.. పవన్ కళ్యాణ్ తో అర్జున్ దాస్ ఫొటోలు వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్.. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఓజీ’ (OG)మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు అర్జున్‌దాస్‌ (Arjun Das) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

చిత్రీకరణలో భాగంగా పవన్‌కల్యాణ్‌తో దిగిన ఫొటోలను అర్జున్‌దాస్‌ అభిమానులతో పంచుకున్నారు. “పవన్‌ కల్యాణ్‌ గారు.. మిమ్మల్ని కలవడం నాకెంతో సంతోషంగా ఉంది. మీతో కలిసి వర్క్‌ చేసిన ప్రతి రోజునూ నేను గుర్తుపెట్టుకుంటా. మనం కలిసి షూట్‌లో పాల్గొన్నప్పుడు నాకోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ వీలున్నప్పుడల్లా ఎన్నో గొప్ప విషయాల గురించి మీరు నాతో చర్చించారు. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్షణాలను నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. మీతో మరో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా” అని పోస్ట్‌ పెట్టారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన‘ఓజీ’ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News