Sunday, June 8, 2025
Homeహెల్త్Lemon Juice: నిమ్మరసం కిడ్నీ వ్యాధికి మంచిదా?

Lemon Juice: నిమ్మరసం కిడ్నీ వ్యాధికి మంచిదా?

Lemon Juice Benefits: నిమ్మకాయ రుచితో పాటు బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలిగిన పండు. దీని ఎక్కువగా వంటలో, జ్యూస్ కూడా చేయవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు కిడ్నీల సమస్యలకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తాయి. ఇవి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది, రక్తన్ని శుద్ధి కూడా చేస్తుంది. అయితే నిమ్మరసం కిడ్నీల ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనే విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

నిమ్మరసం, మూత్రపిండాల ఆరోగ్యం:

కిడ్నీ స్టోన్స్:

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడానికి కారణం మూత్రంలో కాల్షియం, ఇతర ఖనిజాలు పేరుకుపోవడమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల ఇందులో ఉండే సిట్రేట్ యాసిడ్ మూత్రంలో ఉండే కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు ఏర్పడకుండా సహాయపడుతుంది. తద్వారా కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తాయి. కాబట్టి కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నవారు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం మంచిది.

డిటాక్సిఫికేషన్:

నిమ్మరసం తాగడం వల్ల మూత్రపిండాలలో ఉండే వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు బయటకు పంపడానికి సహాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ సి:

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్ లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుంది. విటమిన్ సి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

హైడ్రేషన్:

శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల మూత్రపిండ సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ నీటి కంటే నిమ్మరసం నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండాలపైన ఒత్తిడిని కలుగుతుంది. కాబట్టి నిమ్మరసం నీటిని తాగడం చాలా మంచిది.

విటమిన్లు, ఖనిజాలు:

నిమ్మరసంలో తక్కువ పొటాషియం ఉంటుంది. దీనివల్ల కిడ్నీ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే రక్తపోటు నియంత్రణలో కూడా సహాయపతుంది. నిమ్మరసంలో ఉండే ఇతర పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి

నిమ్మరసాన్ని ఎలా తీసుకోవాలి:

ప్రతిరోజు ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మ చెక్కని కలుపుకొని తాగవచ్చు. లేదా నిమ్మకాయలను సలాడ్, కూరగాయలతో కలుపుకొని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ టీ కంటే నిమ్మ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరంలో ఉండే డిటాక్స్ ను తొలగిస్తుంది. నిమ్మకాయలతో వివిధ రకాల పానీయాలు తయారు చేసుకుని తాగవచ్చు.

నిమ్మకాయతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం కూడా ఎంతో ముఖ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News