Saturday, June 7, 2025
Homeలైఫ్ స్టైల్Dragon Fruit: పోషకాల గని డ్రాగన్ ఫ్రూట్ లాభాలు ఇవే..

Dragon Fruit: పోషకాల గని డ్రాగన్ ఫ్రూట్ లాభాలు ఇవే..

Health Benefits of Dragon Fruit: ఆరోగ్యనిపుణుల ప్రకారం అన్ని రకాల పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఆహారంలో ఏదో ఒక పండును తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ను డైట్ లో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది గులాబీ, పసుపు రంగులో ఉంటాయి. లోపల భాగంలో తెల్లని గుజ్జు ఉండి దానిపైన నల్లని గింజలు ఉంటాయి. ప్రతిరోజు ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఫైబర్, విటమిన్ లతో నిండి ఉంటుంది.

- Advertisement -

డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

యాంటీఆక్సిడెంట్ :

డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తగిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మీ డైట్ లో ఈ పండును చేర్చుకోండి.

జీర్ణక్రియ మెరుగు:

జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ను తింటే మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కలగకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

డయాబెటిస్:

మధుమేహంతో బాధపడేవారు కూడా డ్రాగన్ ఫ్రూట్ ను తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్ ను పెరగకుండా చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫ్రూట్ ను తినే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

గుండెకు మంచిది:

గుండె ఆరోగ్యానికి కూడా డ్రాగన్‌ ఫ్రూట్ మంచి ఎంపిక. ఇది మొండి చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఐరన్ లెవల్స్‌ పెంచుతుంది:

డ్రాగన్‌ ఫ్రూట్‌లో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజు ఒక డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే ఇతర పోషకాలు తల తిరగడం, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

చర్మ ఆరోగ్యం:

డ్రాగన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్‌లు చర్మ ఆరోగ్యానికి మెరుగుపరుచుతుంది. దీని కొందరు ఫేస్‌ ప్యాక్‌ కింద కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంపైన మొటిమలు, నల్ల మచ్చలు రాకుండా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News