Sunday, June 8, 2025
HomeNewsTG Cabinet: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్

TG Cabinet: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్

కొంతకాలంగా ఊగిసలాడుతూ వస్తోన్న తెలంగాణ మంత్రివర్గ(TG Cabinet) విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఉండగా.. తొలి విడతలో మూడు లేదా నాలుగు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రి‌వర్గ విస్తరణపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.

ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి, విద్య, సాధారణ పరిపాలన వంటి శాఖలున్నాయి. ఈ విస్తరణ ద్వారా ఈ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించి, పాలనా భారాన్ని తగ్గించడంతో పాటు, వివిధ శాఖల్లో పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దీంతో మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, పార్టీ పట్ల విధేయత, అనుభవం వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. కేబినెట్ రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీరిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు‌ నాయక్‌, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ఉన్నారు. కానీ ఈ నేతల్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News