Sunday, June 8, 2025
Homeలైఫ్ స్టైల్Period Tips For Women: పీరియడ్స్‌ సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి..

Period Tips For Women: పీరియడ్స్‌ సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి..

Period Tips And Hacks: పీరియడ్స్‌ అనేది మహిళల ఆరోగ్యంలో ఒక భాగం. సాధారణంగా ప్రతినెలా మహిళలో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఈ సమయంలో చాలా మంది మహిళలు ఆరోగ్యసమస్యలకు గురవుతారు. అంతేకాకుండా శరీరంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. పీరియడ్స్‌సమయంలో కొన్ని జాగ్రత్తలు, పరిశుభ్రతలు పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

పిరియడ్స్‌ టైంలో పాటించాల్సిన చిట్కాలు:

పరిశుభ్రంగా ఉండటం:

నెలసరి సమయంలో పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఉపయోగించే ప్యాడ్స్‌, మెన్‌స్ట్రువల్ కప్‌లను ఎల్లప్పుడు మార్చుకోవాలి. ఇలా మార్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లు రావు.

ప్యాడ్స్‌ మార్చడం:

నెలసరి సమయంలో ప్రతి నాలుగు నుంచి ఆరు గంటల పాటు శానిటరీ ప్యాడ్స్‌ మార్చుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ మెన్‌స్ట్రువల్ కప్‌ ఉపయోగిస్తే వీటిని కూడా ఎనిమిది నుంచి 12 గంటలకు మార్చుకోవాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్రమైన ప్రమాదం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

ప్రైవేట్ పార్ట్స్ పరిశుభ్రం:

ప్యాడ్స్ చేంజ్ చేసుకునే ముందు ప్రైవేట్ పార్ట్స్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సబ్బులేదా జెల్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం:

పీరియడ్స్‌ సమయంలో పోషకకరమైన ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

నీరు ఎక్కువగా తాగండి:

ఆరోగ్య నిపుణుల ప్రకారం పీరియడ్స్‌ సమయంలో రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.

షుగర్ పదార్థాలు:

పీరియడ్స్‌టైమ్‌లో అధిక ఉప్పు, చక్కెర ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం తగ్గించండి. ఇవి కడుపు నొప్పిని కలిగిస్తాయి.

సరైన నిద్ర:

నెలసరి సమయంలో శరీరం అలసిపోతుంది కాబట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం అవసరం.

వ్యాయామం చేయడం:

చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

వేడి కాపండి:

తీవ్రమైన కడుపునొప్పి ఉంటే వేడి నీటిని లేదా హీటింగ్ ప్యాక్స్ ను ఉపయోగించండి. ఇది కడుపునొప్పిని తగ్గిస్తాయి.

అల్లం టీ:

అల్లం టీ ఒక హెర్బల్ టీ దీన్ని తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పి, తలనొప్పి అలాంటి సమస్యలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

తేలికపాటి దుస్తులు:

పీరియడ్స్‌ సమయంలో తేలికపాటి దుస్తులు వేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది.

ఈ విధంగా పీరియడ్స్‌ సమయంలో సరైన ఆహార, తగినంత నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News