Sunday, June 8, 2025
Homeహెల్త్Sesame Seeds: నువ్వులు తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే..

Sesame Seeds: నువ్వులు తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే..

Sesame Seeds Benefits: నువ్వులను తరుచుగా వంట్లో, స్వీట్స్‌లో ఉపయోగిస్తారు. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి వీటిలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. వీటిని పవర్‌ హౌస్‌ అని కూడా పిలుస్తారు. ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నువ్వులు తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.

- Advertisement -

నువ్వుల వల్ల కలిగే లాభాలు:

• నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వులతో తయారు చేసే పదార్థాలు తినడం వల్ల కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణ పాల కంటే నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకోండి.

• గుండె సంబంధిత సమస్యలో బాధపడేవారికి నువ్వులు ఒక మంచి ఎంపిక. ఇందులో ఒమేగా-3, 6, 9 కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

• జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ నువ్వులు సహాయపడుతాయి. ఇందులో ఫైబర్‌ లభిస్తుంది. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు నుంచి ఉపశమనం పొందవచ్చు.

• డయాబెటిస్‌ తో బాధపడేవారు కూడా వీటిని తినవచ్చు. నువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు జ్ఞాపకశక్తిని మెరుగుపరచి, నాడీ వ్యవస్థ పనితీరును బాగు చేస్తుంది.

• అధిక బరువు సమస్యతో బాధపడేవారు నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.ఇందులో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అలాగే అతిగా తినకుండా ఆపుతుంది.

• కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్‌లు, విటమిన్‌ ఇ చర్మంపై ముడతలు, మచ్చలు, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం లేదా ఫేస్‌ ప్యాక్‌లో ఉపయోగించడం మంచిది.

• తరచుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు నువ్వుల లడ్డు తినడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌లు, కొన్ని ఖనిజాలు శరీరానికి సహాయపడుతాయి.

నువ్వులను ఎలా చేర్చుకోవచ్చు:

నువ్వులను మీరు తినే సలాడ్‌లు, స్మూతీలు, స్నాక్స్‌లో చేర్చుకోవచ్చు లేదా ఉండలుగా కూడా తినవచ్చు. మీ రోజువారీ ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల పైన తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

గమనిక: అనారోగ్య సమస్యతో బాధపడేవారు నువ్వులను చేర్చుకొనే ముందు ఆరోగ్యనిపుణుల సలహా తీసుకోండి.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News