నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna)అభిమానులకు క్రేజీ అప్టేడ్స్ అందుతున్నాయి. మరో రెండు రోజుల్లో బాలయ్య 66వ ఏటలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్టేడ్స్ వరుసగా వస్తున్నాయి. తాజాగా అఖండ2(Akhanda 2) మూవీ టీజర్ అప్టేడ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జార్జియా దేశంలో జరుగుతుంది.
అఖండ సినిమాకు సీక్వెల్ కావడంతో పాటు బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి మాస్ కాంబోలో అఖండ2 తెరకెక్కుతుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ జూన్ 9 సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ తాండవం చేయబోతుంది అంటూ త్రిశూలంతో ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఇంతకుముందే బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం వీరి కాంబోలో వచ్చిన వీరసింహా రెడ్డి అభిమానులకు పూనకాలు తెప్పించింది. మూవీలో బాలయ్య చెప్పిన డైలాగ్స్, ఫైట్స్, గోపిచంద్ టేకింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో బాలయ్య లుక్, యాక్టింగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Akhanda 2: బాలయ్య తాండవం రెడీ.. అఖండ 2 టీజర్ ఎప్పుడంటే..?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES