Gullak Web Series On OTT: కోవిడ్ ప్రభావంతో ప్రజలు ఓటీటీకి చాలా దగ్గరయ్యారు. మంచి కంటెంట్, కమిట్మెంట్ ఉన్న నటులు ఓటీటీ పుణ్యనా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఓటీటీలో వివిధ జోనర్స్ లో.. వివిధ భాషల్లో సినిమాలుఅందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను అత్యంతంగా ఆకట్టుకుంటున్న ఓ హిందీ వెబ్ సిరీస్ పేరే గుల్లక్ ( Gullak) గుల్లక్ అనేది మధ్యతరగతి జీవితాలను అత్యంత అద్భుతంగా చిత్రీకరించిన హృదయమైన భావన. ఈ సిరీస్‌ను శ్రేయాన్ష్ పాండే ది వైరల్ ఫీవర్ (TVF) బ్యానర్‌పై రూపొందించారు, గుల్లక్ మూడు సిరీస్ లు విమర్శకుల ప్రశంసలు పొంది.. ఇప్పుడు సీజన్ 4తో తిరిగి వచ్చింది.ఈ సినిమామానవీయ సంబంధాలకి సహజత్వానికి అద్దం పడుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
‘ది వైరల్ ఫీవర్ (TVF)’ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మినీ సిరీస్, కుటుంబలోని బంధాలు అనుబంధాలు, మధ్య తరగతి తాలుకు జీవన పరిస్థితులు సంఘర్షణలు సమస్యలు, వారి కోరికలు, ఆశయాలు, ఆకాంక్షలకు పెద్ద పీట వేసి బంధాల తాలుక సహజ సౌందర్య సుగుణాలను అద్భుతంగా మిళితం చేస్తూ ప్రతి ఎపిసోడ్‌తో ఓ మధురానుభూతిని ప్రేక్షకులకు పంచుతుంది.
ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో నివసించే మిశ్రా కుటుంబ కుటుంబాన్ని వారి జీవన విధానాన్ని చిత్రిస్తుంది. సంతోష్ మిశ్రా (తండ్రి), శాంతి మిశ్రా (అమ్మ), వారి ఇద్దరు కుమారులు ఆనంద్ అమన్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ సిరీస్ వారి నిత్య జీవితంలోని సవాళ్ళని, చిన్ని చిన్ని ఆనందాలని కుటుంబ కలహాలని కుటుంబం చుట్టూ పెనవేసుకున్న బంధాలను అత్యంత వినోధభరితంగా తెరకెక్కించారు. ఈ కథలు సాధారణ మనిషి జీవిత సంఘటనల చుట్టూ తిరుగుతూ.. మనిషి మనసు పొరల్లో లోతైన భావోద్వేగాలను వెలికి తీస్తాయి. సహజత్వానికి దగ్గరగా సామజిక సందేశాలు ఇస్తూ గుల్లక్ మీ గుండెల్లో ఒక ఫీల్-గుడ్ సిరీస్ గా మిగిలిపోతుంది. ఇంటిల్లిపాదిగా కుటుంబంతో కలిసి చూడడానికి అనువుగా ఆస్వాదించే విధంగా చిత్రీకరించబడింది. జమీల్ ఖాన్, గీతాంజలి కులకర్ణి, వైభవ్ రాజ్ గుప్తా, హర్ష్ మాయర్, సునీతా రాజ్‌వర్, సాద్ బిల్‌గ్రామి, మరియు దీపక్ కుమార్ మిశ్రా వంటి కీలక తారాగణం నటించారు.ఈవెబ్ సిరీస్ IMDbలో 9.1/10 రేటింగ్ సాధించింది.సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.