Sunday, June 8, 2025
Homeలైఫ్ స్టైల్Coconut Rice: అత్యంత పోషకరమైన కొబ్బరి రైస్ రెసిపీ ఇదే..

Coconut Rice: అత్యంత పోషకరమైన కొబ్బరి రైస్ రెసిపీ ఇదే..

Coconut Rice For Health: కొబ్బరి రైస్ ను పిల్లలు, పెద్దలు ఏంటో ఇష్టంగా తింటారు. ఈ డిష్‌కు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఇది రుచికరమైన వంట మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రెసిపీలో ఉపయోగించే పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి రైస్‌ వల్ల శరీరానికి కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.

- Advertisement -

కొబ్బరి రైస్‌లో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌, ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. కొబ్బరి రైస్‌ తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో మంచి ఆహారం. కొబ్బరిలో లారిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది యాంటీవైరల్‌, యాంటీబాక్టీరియల్‌ గుణాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి.

కొబ్బరి రైస్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యని మెరుగుపరుచుతుంది. అయితే అతిగా కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ రెసిపీ తినడం వల్ల అతిగా తినకుండా ఉంటారు.

కొబ్బరి రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాని తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులను దూరంలో చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఫాస్పరస్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ రెసిపీని డైట్‌లో భాగంగా తీసుకోవచ్చు.

డయాబెటిస్‌ ఉన్నవారికి కొబ్బరి మంచి ఆహారం. ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కొంట్రోల్‌ చేయడంలో కీలక ప్రాత పోషిస్తాయి. అయితే కొబ్బరి అందరీకి పడకపోవచ్చు కాబట్టి దీని తీసుకొనే ముందు ఆరోగ్యనిపుణులు సలహా తీసుకోండి.

కొబ్బరి రైస్‌ ఎలా చేసుకోవచ్చు:

కావలసిన పదార్థాలు: బియ్యం: 1 కప్పు, కొబ్బరి పాలు: 1/4 కప్పు, కొబ్బరి తురుము: 1/2 కప్పు, నూనె: 1 టేబుల్ స్పూన్, నీరు : 1, ఆవాలు: 1/2 టీస్పూన్, వేరుశెనగలు : 1 టేబుల్ స్పూన్, మినపప్పు : 1 టీస్పూన్, శెనగపప్పు : 1 టీస్పూన్, కరివేపాకు, ఉప్పు, ఎండుమిర్చి: 1-2, పచ్చిమిర్చి: 2-3, కొత్తిమీర

తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని కడిగి ఒక కప్పు నీటిలో బియ్యాన్ని ఉడికించాలి. ఆ తరువాత ఒక ప్లేట్‌లోకి అన్నం తీసుకొని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేసుకొని ఆవాలు, శెనగపప్పు, మినపప్పు వేసి బంగారు రంగులోకి తీసుకోండి. ఆ తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్‌ పైన ఒకటి లేదా రెండు నిమిషాల పాలు కొబ్బరిని బంగారు రంగు వచ్చే వరకు కలపండి. ఇప్పుడు కొబ్బరి పాలు, ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు ఉడికించి అన్నాన్ని అందులోకి కలుపుకోండి. అంతే కొబ్బరి రైస్‌ రెడీ.

కొబ్బరి రైస్‌ ను పిల్లలు, పెద్దలు తినవచ్చు. దీని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా భోజనంలో తీసుకోవడం మంచిది. అయితే ఏదైనా మితంగా తినడం మంచిది. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News