Gautam Adani salary: దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.10.41 కోట్ల వేతనం పొందారు. మన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల కంటే, తన సొంత గ్రూప్ కంపెనీల్లో పని చేస్తున్న చాలా మంది ఎగ్జిక్యూటివ్‌ల శాలరీ కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. వాస్తవానికి ఓడరేవులు, ఇంధన రంగాల్లో విస్తరించిన తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో కేవలం రెండింటి నుంచి మాత్రమే అదానీ వేతనం తీసుకుంటున్నారు. అయితే 2023-24లో రూ.9.26 కోట్లుగా ఉన్న ఈ మొత్తం 2024-25లో 12 శాతం మేర పెరగడం గమనార్హం.
కంపెనీల వారీగా ఆదాని పొందుతున్న వేతనాలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఆదాని గ్రూప్స్ లలో ప్రధాన సంస్థ. ఈ సంస్థ నుంచి 2024-25 అర్థిక సంవత్సరం లో ఆదాని రూ. 2.26 కోట్లు తీసుకున్నారు. దీనికి అదనంగా అలవెన్సులు ఇతర ప్రయోజనాల ద్వారా రూ. 28 లక్షలు తీసుకున్నాడు. మొత్తంగా 24-25 అర్థిక సంవత్సరంకు గాను రూ. 2.54 కోట్లు వేతన రూపంలో పొందాడు. గత ఏడాదితో పొందిన రూ.2.46 పోల్చితే కాస్త ఎక్కువే..
ఆదాని గ్రూపుల్లో మరో ప్రతిస్టాత్మాకమైన కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషనల్ ఎకనమిక్ జోన్ (APSEZ) ఈ సంస్థ నుంచి గౌతమ్ అదానీ రూ.1.8 కోట్ల వేతనంగా, రూ.6.07 కోట్ల కమిషన్‌గా (లాభాల్లో వాటా)తో కలిపి రూ.7.87 కోట్లు పొందారు. గడిచిన అర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.6.8 కోట్లుగా ఉండి ఈ సంవత్సరం స్వల్పంగా పెరిగింది.
అంబానీతో సహా ఇతర సంపన్నుల వేతనాలు
ముకేష్ అంబానీ కోవిడ్ తర్వాత వేతనం తీసుకోవడం మానేశాడు. కరోనా ముందు ఆయన ₹15 కోట్ల వరకు వేతనం పొందేవారు .
పవన్ ముంజాల్ రూ.109 కోట్లు,
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.80.62కోట్లు,
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యం 76.25 కోట్లు,
రాజీవ్ బజాజ్ రూ.53.75 కోట్లు,
భారతీ ఎంటర్‌ప్రైజెస్ అధినేత సునీత్ మిత్తల్ రూ.32.27 కోట్లు మేర వేతనాలు 23-24 ఆర్థిక సంవత్సరంకు గాను తీసుకుంటున్నారు.
అదానీ కంటే కొందరు ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలే ఎక్కువ..
అదానీ గ్రూప్‌లోని కొందరు ఎగ్జిక్యూటివ్‌లతో పోల్చితే గౌతమ్ అదానీ వేతనం తక్కువగా ఉంది. ఏఈఎల్ సీఈఓ వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు పొందుతుండగా, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్.జైన్ రూ.11.23 కోట్లువేతనం పొందుతున్నారు.
అయినా సంపన్నుడే..
అదానీ సంపద విలువ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 82.5 బిలియన్ డాలర్లుగా ఉంది. హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా ఆదానీ ఆస్తులు ఒక్కసారిగా 150 బిలియన్ డాలర్ల మేరకు కరిగిపోయాయి.అయినా ఆదాని గడిచిన ఏడాదిలో 2 సార్లు ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలవడం గమనార్హం. ముకేశ్ అంబానీ ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో 104 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ 82.5 బిలియన్ డాలర్ల తో 20వ స్థానంలో ఉన్నారు.